NZB: నగరంలో ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు సీపీ సాయిచైతన్య ఆధ్వర్యంలో గురువారం రాత్రి ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ట్రాఫిక్ ఇబ్బందులను తీర్చాలని ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు మూడునెలల క్రితం ఖలీల్‌వాడీ, దేవిరోడ్లను వన్‌వే చేశారు. దీంతో రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకున్నామని సీపీ తెలిపారు.