KMM: సత్తుపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే డాక్టర్ మట్ట రాగమయి కాంగ్రెస్ పార్టీ అధినేత సోనియా గాంధీ జన్మదిన వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్యే కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన గొప్ప నాయకురాలు సోనియా గాంధీ అని అన్నారు.