MHBD: జిల్లాలో గంజాయి సాగు చేస్తే జైలు శిక్ష తప్పదని ఎస్పీ శబరీష్ హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గంజాయి సాగును అడ్డుకునేందుకు డ్రోన్ టెక్నాలజీ వాడుతున్నామని అన్నారు. నర్సింహులపేటలో వ్యవసాయ భూమిలో గంజాయి సాగు చేస్తున ఒక వ్యక్తిని అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.