SDPT: బెజ్జంకి మండల కేంద్రంలో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ జన్మదిన వేడుకలు ఉత్సాహంగా నిర్వహించారు. మండల కాంగ్రెస్ అధ్యక్షుడు లింగాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో కార్యకర్తలు కేక్ కట్ చేసి టపాసులు పేల్చుతూ సంబరాలు జరుపుకున్నారు. మహేష్ కుమార్ గౌడ్ పార్టీ బలోపేతానికి, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుకు కృషి చేస్తున్న నాయకుడని కొనియాడారు.