HYD: బక్రీద్ పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని బి. సుమతి ప్రజలకు సూచించారు. పండుగ ఏర్పాట్లపై ముస్లిం, గోరక్షక్ సభ్యులు, వివిధ శాఖల అధికారులతో పోలీసులు సమన్వయ సమావేశం నిర్వహించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో సీసీ కెమెరాలతో నిఘా పెంచనున్నట్లు తెలిపారు. సోషల్ మీడియాలో వదంతులను నమ్మవద్దని, చట్టాన్ని చేతిలోకి తీసుకోవద్దని ప్రజలకు హెచ్చరించారు.