NGKL: ఉప్పునుంతల మండలం నుంచి తాడూర్ గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారి గుంతల మయంగా మారి ప్రయాణికులకు నరకం చూపిస్తోంది. గత వర్షాల కారణంగా రోడ్డు కొన్నిచోట్ల పూర్తిగా దెబ్బతింది. వాహనదారులు సవాల్‌గా భావిస్తూ ప్రయాణిస్తున్నారు. స్థానికులు అధికారులు వెంటనే స్పందించి, మరమ్మతులు చేపట్టి ప్రమాదాలను నివారించాలని కోరుతున్నారు.