KMM: ఇందిరమ్మ ఇళ్ల పథకంతో రాష్ట్ర ప్రభుత్వం పేదల కుటుంబాల్లో వెలుగులు నింపిందని మార్కెట్ ఛైర్మన్ నరసింహారావు అన్నారు. శనివారం ఎర్రుపాలెం(మం) జమలాపురం, సత్యనారాయణపురంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు మార్కెట్ ఛైర్మన్ శంకుస్థాపన చేశారు. ప్రతి నిరుపేద కుటుంబానికి సొంతిల్లు ఉండాలనే సంకల్పంతోనే ప్రభుత్వం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు.