KMM: గుండెపోటుతో ఓ సీపీఎం నేత మృతి చెందిన ఘటన ఆదివారం తిరుమలాయపాలెం మండలంలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే.. రాజారాంపేటకు చెందిన సీపీఎం నాయకులు పోతనబోయిన పెరుమాళ్ళుకు ఛాతి భాగంలో విపరీతమైన నొప్పితో కుప్పకూలిపోయారు. ఆయనను ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆయన మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేశారు.