NRPT: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల పేరిట మక్తల్ నియోజకవర్గంలో అక్రమంగా ఇసుక రవాణా జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. మాగనూరు మండలం పెద్దవాగు నుంచి అనుమతుల పేరుతో అక్రమ రవాణా చేస్తున్న వారిని పోలీసులు, అధికార పార్టీ నేతల ఒత్తిళ్లతో పట్టుకున్నట్టే పట్టుకుని వదిలేశారని ఆరోపించారు.