WGL: రాయపర్తి మండలం తిర్మాలయపల్లిలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని శుక్రవారం ఎంపీడీవో కిషన్ తనిఖీ చేశారు. విద్యార్థులకు అందిస్తున్న భోజనం నాణ్యత, ప్రమాణాలను పరిగణిస్తూ వివరాలను అడిగి తెలుసుకున్నారు. వసతి గృహం పరిసరాలను పరిశీలించి, విద్యార్థుల హాజరు శాతం అడిగి తెలుసుకుని, ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని పేర్కొన్నారు.