JGL: నూతనంగా ఎన్నికైన గ్రామపంచాయతీ పాలకవర్గాలు, గ్రామ అభివృద్ధికి పాటుపడాలని, మాజీ మంత్రి జీవన్ రెడ్డి అన్నారు. రూరల్ మండలం చర్లపల్లి గ్రామపంచాయతీ పాలకవర్గం ఏకగ్రీవంగా ఎన్నిక కావడంతో జీవన్ రెడ్డిని కలిశారు. గ్రామాభివృద్ధికి ప్రత్యేక కృషి చేయనున్నట్టు తెలిపారు. జీవన్ రెడ్డి నూతన కార్యవర్గాన్ని శాలువాలతో ఘనంగా సన్మానించి అభినందించారు.