వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం గుగులోతు బిచ్చ్యకు చెందిన పూరిల్లు షార్ట్ సర్క్యూట్ కారణంగా పూర్తిగా దగ్ధమైంది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఇంటి పూరిల్లు, వంట సామాగ్రి కాలిపోయాయి. గ్యాస్ సిలిండర్ పేలకపోవడంతో గ్రామస్థులు ఊపిరి పీల్చుకున్నారు. స్థానికులు మంటలను అదుపు చేశారు. ఈ ఘటన పై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.