ఉమ్మడి వరంగల్ జిల్లాలో రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తుది జాబితాను అధికారులు శనివారం ప్రకటించారు. వార్డు మెంబర్, సర్పంచ్‌గా పోటీ చేసే అభ్యర్థులకు గుర్తులు కూడా కేటాయించారు. దీంతో పోటీదారులు తమకు కేటాయించిన గుర్తులతో ప్రజల్లోకి వెళ్ళి ప్రచారాన్ని ముమ్మరం చేయనున్నారు.