MBNR: మహమ్మదాబాద్ మండలం చౌదర్ పల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని బాల భీమాంజనేయుడి జాతర బ్రహ్మోత్సవాలు డిసెంబర్ 3 నుంచి 11వ తేదీ వరకు జరగనున్నాయి. ప్రధాన ఘట్టమైన రథోత్సవం డిసెంబర్ 5న ఉదయం 4 గంటలకు కనులపండువగా జరుగుతుందని ఆలయ కమిటీ ఛైర్మన్ సుంకిరెడ్డి కృష్ణారెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు.