ADB: విద్యుత్ ప్రమాదాలు జరగకుండా ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఏఈ తిరుపతిరెడ్డి సూచించారు. భీంపూర్ మండలంలోని వాడేగామా గ్రామంలో విద్యుత్ ప్రమాదాలపై సిబ్బందితో కలిసి అవగాహన కల్పించారు. కరెంటు స్తంభాలు, తీగలు కిందికి వంగిన సిబ్బందికి తెలియజేయాలని కోరారు. అత్యవసర పరిస్థితుల్లో 1912 నంబర్‌ను సంప్రదించాలని పేర్కొన్నారు.