NZB: ఓటరు జాబితా పారదర్శకంగా రూపొందించాలని, పొరపాట్లకు తావు ఇవ్వొద్దని ఎన్నికల అధికారులు సమావేశాలు నిర్వహించి చెప్తున్నా క్షేత్రస్థాయి సిబ్బంది మాత్రం నిర్లక్ష్యం వీడడం లేదు. జాన్కంపేట్ గ్రామంలో 3వ వార్డులో ఏళ్ల క్రితమే మరణించిన వారి పేర్లు కూడా జాబితాలో కనిపించడం సిబ్బంది పనితీరుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి.