NZB: మహారాష్ట్రలో కురిసిన భారీ వర్షాల కారణంగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరుతోంది. ఎగువ ప్రాంతం నుంచి 56 వేల క్యూసెక్కుల నీరు వస్తుండటంతో, ప్రాజెక్టుకు చెందిన 16 గేట్లను తెరిచి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు జలకళ సంతరించుకుంది.