ADB: యువకులు దేశ రక్షణలో ముందుండటం అభినందనీయమని దాన్నూరు గ్రామస్తులు అన్నారు. ఇటీవల ఇండియన్ ఆర్మీలో చేరి శిక్షణ పూర్తి చేసుకుని స్వగ్రామానికి వచ్చిన ఆర్మీ జవాన్ సాబ్లే శ్రావణ్‌ను గ్రామస్థులు ఆదివారం ఘన స్వాగతం పలికి శాలువాలతో సత్కరించారు. కార్యక్రమంలో అమర్ సింగ్, కృష్ణ, అమర్ సింగ్, దరసింగ్, రోహిదాస్, అనిల్ తదితరులు ఉన్నారు.