WGL: నల్లబెల్లి మండల కేంద్రంలోని నారక్కపేట గ్రామంలో ఓటర్ లిస్టులో అధికారలు తప్పిదాలు చేశారంటూ గ్రామ ప్రజలు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామంలోని ఒకే వ్యక్తికి లిస్ట్‌లో వ్వేర్వేరు పేరులతో మూడు చోట్ల ఓటు నమోదు చేశారని తెలిపారు. ఏ పేరుతో నామినేషన్ సమర్పించాలో అర్థం కాని పరిస్థితి నెలకొందని అన్నారు. అధికారులు స్పందించి తప్పిదాలను సరిచేయాలని కోరారు.