VKB: గ్రామపంచాయతీ ఎన్నికలు సరైన విధంగా నిర్వహించేలా అధికారులు అప్రమత్తంగా పనిచేయాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ సూచించారు. సోమవారం కలెక్టరేట్ నుంచి సంబంధిత ఎన్నికల నిర్వహణ అధికారులతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలో సర్పంచ్ ఎన్నికలు మూడు విడుతలుగా నిర్వహించనున్నట్లు చెప్పారు. అవసరమైన బ్యాలెట్లు సిద్ధంగా ఉన్నాయని అన్నారు.