SRD: ప్రభుత్వ జీవోలతో డైరీని రూపొందించడం అభినందనీయమని కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. కేపీటీఎఫ్ ఆధ్వర్యంలో రూపొందించిన డైరీని కలెక్టర్ కార్యాలయంలో శనివారం ఆవిష్కరించారు. ఆమె మాట్లాడుతూ.. పదవ తరగతిలో 100% ఫలితాలు సాధించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు సోమశేఖర్, ప్రధాన కార్యదర్శి రాంచందర్ పాల్గొన్నారు.