MBNR: మిడ్జిల్ కొత్తూరు రహదారి నిర్మాణంలో గుతెదార్ అలసత్వం ప్రభుత్వ నిర్లక్ష్యం విరసి ప్రయాణికులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. మిడ్జిల్ మండలం కేంద్రం నుంచి కొత్తూరు రహదారి కంకర పరిచి వదిలేయడంతో ప్రయాణం నరకప్రాయంగా మారిందని వాహనదారులు వాపోతున్నారు. ఇప్పటికైనా సంబంధిత కాంట్రాక్టర్ స్పందించి రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలని వాహనదారులు కోరుతున్నారు.