VKB: కొడంగల్లో రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో మైనారిటీలకు ఛైర్మెన్, వైస్ ఛైర్మన్ పదవుల్లో అవకాశం కల్పించాలని మైనార్టీ నాయకుడు ఎస్ఎం. గౌసన్ అన్నారు. కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గి, మద్దూర్, కొడంగల్ మున్సిపాలిటీల్లో ఒక్క మున్సిపాలిటీలోనైనా ఛైర్మెన్, వైస్ ఛైర్మన్ పదవుల్లో ముస్లిం, మైనారిటీలకు అవకాశంతో సముచిత స్థానం కల్పించాలని పేర్కొన్నారు.