రంగారెడ్డి జిల్లాలో పడిపోతున్న ఉష్ణోగ్రతలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. జిల్లాలో రోజురోజుకు చలి తీవ్రత పెరిగి రాత్రి వేళల్లో ఉష్ణోగ్రతలు పడిపోతుండడంతో ప్రజలు గజగజ వణికిపోతున్నారు. ఉదయం 8 గంటలు అయినా.. రహదారులను మంచి దుప్పటి వీడటం లేదు. దీంతో పాటు పొగ మంచు రోడ్లను కప్పేయడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.