BDK: చుంచుపల్లి మండలంలో ఆదివారం సీపీఐ మూడవ మహాసభ నిర్వహించారు. ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పాల్గొని పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కమ్యూనిజం అనే పదం అజరామరమని మరో వందేళ్లు ప్రజాక్షేత్రంలో ధైర్యంగ మెలగగలమని తెలిపారు. పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని మనకు అండగా ఎర్ర జెండా ఉంటుందని అన్నారు.