ADB: సరైన మందులను వాడి టీబీ వ్యాధిని పూర్తిగా నిర్మూలించవచ్చునని ప్రాథమిక కేంద్రం హెల్త్ ఎడ్యుకేటర్ రాథోడ్ రవీందర్ తెలిపారు. మండలంలోని మాలేపూర్ గ్రామానికి చెందిన రమేష్ అనే యువకుడు క్షయ వ్యాధితో బాధపడుతున్నాడు. వైద్య అధికారులు శనివారం ఆయన్ను కలిసి రిమ్స్ ఆసుపత్రిలో మెరుగైన వైద్యం చేయించుకోవాలని 108 వాహనం ద్వారా తరలించారు.