SRD: రామచంద్రపురం డివిజన్ పరిధిలోని మందుమూల శ్రీశ్రీశ్రీ సోమేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం స్వామివారి కల్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రావడంతో పండగ వాతావరణం నెలకొంది. ఆలయ పరిసరాలు స్వామివారి నామస్మరణతో మార్మోగాయి. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు.