KMM: రైతులు మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలనే సాగు చేయాలని, ప్రైవేట్ కంపెనీల చేతిలో మోసపోవద్దని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ వర్సిటీలో ‘విత్తన వారోత్సవాలు-2026’ కార్యక్రమాన్ని శనివారం ఆయన ప్రారంభించారు. డిజిటల్ అగ్రికల్చర్, రోబోటిక్స్ ల్యాబ్లను సందర్శించి డ్రోన్ల పరిశోధనలను అభినందించారు.