GDWL: గద్వాల్ జిల్లాలో డిసెంబర్ 11న జరగనున్న మొదటి విడత స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో, జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు అధికారులకు, సిబ్బందికి ఎన్నికల విధులలో పాటించాల్సిన అంశాలపై సమగ్ర సమావేశం మంగళవారం నిర్వహించారు. శాంతియుత ఎన్నికలే ధ్యేయం, కట్టుదిట్టమైన భద్రతతో గద్వాల్ పోలీస్ సర్వ సిద్ధం అని ఎస్పీ స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారం నేటితో ముగుస్తుతుందని తెలిపారు.