MNCL: జిల్లాలో సైబర్ మోసాలపై ప్రత్యేక నిఘా ఉంచినట్లు మంచిర్యాల DCP భాస్కర్ ఓ ప్రకటనలో తెలిపారు. గుర్తు తెలియని వ్యక్తులకు వ్యక్తిగత వివరాలు చెప్పొద్దన్నారు. బ్యాంకు సిబ్బంది ఎప్పుడూ బ్యాంకు ఖాతా వివరాలు అడగరని తెలిపారు. సైబర్ మోసానికి గురయ్యామని తెలిసిన వెంటనే ఫిర్యాదు చేయాలన్నారు. ఆఫర్ల పేరుతో వచ్చే వాట్సాప్ లింకులు క్లిక్ చేయకూడదన్నారు.