MNCL: ఆయిల్ ఫామ్ తోటలతో రైతులకు మేలు జరుగుతుందని మంచిర్యాల డివిజన్ సహాయ వ్యవసాయ సంచాలకులు (ADA) శ్రీనివాస్ అన్నారు. మంగళవారం జన్నారం మండలంలోని దేవునిగూడ గ్రామంలోని ఆయిల్ పామ్ తోటలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయిల్ పామ్ సాగులో రైతులు అవలంబించాల్సిన పద్ధతులు, దిగుబడికి సంబంధించిన సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఏఈవో అక్రమ్, రైతులు పాల్గొన్నారు.