రామాయంపేట మండల వ్యాప్తంగా 16 గ్రామ పంచాయతీలకు సర్పంచ్, వార్డు సభ్యులకు గుర్తులు కేటాయింపు పూర్తయిందని ఎంపీడీవో షాజీలొద్దీన్ తెలిపారు. 16 సర్పంచ్ స్థానాలకు 70 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారని, 138 వార్డు స్థానాలకు గాను 27 ఏకగ్రీవమైనట్లు ప్రకటించారు. 111 వార్డు స్థానాలకు 275 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారని పేర్కొన్నారు.