WNP: పానగల్ మండలం కేతేపల్లి గ్రామంలోని సర్పంచ్ రమేశ్ ఆధ్వర్యంలో గురువారం మధుమేహ వ్యాధిగ్రస్థులకు ఉచిత నేత్ర రెటినోపతిపై వైద్య పరీక్షలను నిర్వహించారు. జిల్లా కంటి వైద్య బృందం డాక్టర్ వినయ్ మధుమేహ రెటినోపతిపై కాంతిని గ్రహించే పరీక్షలు నిర్వహించి, అవసరమున్న వారిని వనపర్తి జిల్లా ఆసుపత్రికి పంపించారు.