NLG: నకిరేకల్ నుంచి శాలిగౌరారం, గురజాల మీదుగా నార్కట్‌పల్లి మండలం అమ్మనబోలు వరకు కొత్తగా బస్సు సర్వీసును ప్రారంభించినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఈ బస్సు ప్రతి రోజు మధ్యాహ్నం 1.30 గంటలకు నకిరేకల్ నుంచి బయలుదేరుతుందని పేర్కొన్నారు. అలాగే తిరుగు ప్రయాణంలో మధ్యాహ్నం 3 గంటలకు అమ్మనబోలు నుంచి నకిరేకల్‌కు బయలుదేరుతుందని అధికారులు వెల్లడించారు.