HNK: ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి భక్తులకు అధికారులు కీలక సూచనలు చేశారు. దేవాలయంలో రేపటి నుంచి (డిసెంబర్ 10) నుండి 15 వరకు జాతర ఏర్పాట్ల దృష్ట్యా మల్లికార్జున స్వామి వారి నిజరూప దర్శనం నిలిపివేయనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. డిసెంబర్ 16న దృష్టి కుంభం నిర్వహించి స్వామివారి దర్శనాలు పునః ప్రారంభమవుతాయని తెలిపారు. భక్తులు గమనించాలన్నారు.