SDPT: ప్రజల ప్రాణ రక్షణను దృష్టిలో ఉంచుకుని, ప్రమాదాలకు కారణమవుతున్న చైనా మాంజా (నైలాన్ దారాలు) వినియోగాన్ని ప్రభుత్వం పూర్తిగా నిషేధించిందని పోలీస్ కమిషనర్ ఎస్.రష్మీ పెరుమాళ్ తెలియజేశారు. చైనా మాంజా కారణంగా ద్విచక్ర వాహనదారులు, పాదచారులు, పక్షులు తీవ్రంగా గాయపడటంతో పాటు ప్రాణ నష్టం సంభవించిన ఘటనలు చోటుచేసుకున్నాయని ఆమె పేర్కొన్నారు.