MBNR: స్థానిక ఎన్నికల నేపథ్యంలో బ్యాక్ వార్డ్ క్లాస్ ఫెడరేషన్ పార్టీ జిల్లా అధ్యక్షులు కొత్త శ్రీను ఆయన సతీమణి కొత్త రాధా శనివారం రాత్రి బీజేపీలో చేరారు. మహబూబ్ నగర్ భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి వారికి కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో రమేష్ మల్లేష్ సుబ్రహ్మణ్యం నరసింహులు ఉన్నారు.