KMM: చిత్తడి నేలలు (వెట్ ల్యాండ్) గుర్తించి వాటి పరిరక్షణకు చర్యలు చేపట్టాలని అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇవాళ చింతకాని మండలం మత్కేపల్లి గ్రామ తుమ్మలమ్మ చెరువును వెట్ ల్యాండ్ కమిటీతో కలిసి ఆయన పరిశీలించారు. చిత్తడి నేలలు గుర్తించడం ద్వారా భూమి యాజమాన్యం ఎట్టి పరిస్థితుల్లో మారదని పేర్కొన్నారు.