KNR: రామడుగు మండలం గోపాల్రావుపేట్ అంగన్వాడీ కేంద్రంలో పండిట్ జవహర్లాల్ నెహ్రూ జయంతి వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో గోపాల్రావుపేట్ సర్పంచ్, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సత్యప్రసన్న వెంకటరాం రెడ్డి, గోపాలరావుపేట్ మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్ పాల్గొన్నారు.