SRCL: ఎల్లారెడ్డిపేట మండలం రాగట్లపల్లి గ్రామ సర్పంచ్‌గా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి నెత్తెట్లా లస్మయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గ్రామ శాఖ అధ్యక్షులు సిరిపురం నరేందర్ ఆధ్వర్యంలో గ్రామస్తులందరూ కలిసి లస్మయ్యను ఎన్నుకున్నట్లు పేర్కొన్నారు. అదేవిధంగా ఆరు వార్డులకు వార్డు సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వారిని కేకే మహేందర్ రెడ్డి అభినందించారు.