MBNR: దేవరకద్ర మున్సిపాలిటీ కేంద్రంలోని ZPHS పాఠశాలలో సైన్స్ల్యాబ్ నిర్మాణానికి దేవరకద్ర ఎమ్మెల్యే జీ. మధుసూదన్ రెడ్డి భూమి పూజ చేశారు. అనంతరం విద్యార్థులకు కోజెంట్ కంపెనీ సహకారంతో స్కూల్ షూస్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కొజెంట్ ప్రతినిధులు, పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.