MNCL: చెన్నూర్ మండలం కిష్టంపేట గ్రామంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కొనసాగుతున్న అదనపు గదుల నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా పనుల పురోగతిని పర్యవేక్షించారు. అనంతరం మాట్లాడుతూ.. అదనపు గదుల నిర్మాణం పనులు త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.