WNP: అమరచింత జడ్పీహెచ్ఎస్లో సీఎం కప్-2025 టార్చ్ ర్యాలీని సబ్ ఇన్స్పెక్టర్ స్వాతి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. గ్రామీణ క్రీడాకారుల్లోని ప్రతిభను వెలికితీసేందుకే ప్రభుత్వం ఈ పోటీలను నిర్వహిస్తోందని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఈవో, పీడీలు రవికిరణ్ గౌడ్, వెంకటేష్ పాల్గొన్నారు.