SRPT: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రేపు తుది ఓటర్ జాబితాను విడుదల చేయనున్నారు. ముసాయిదా ఓటర్ జాబితాపై తీవ్ర అభ్యంతరాలు రావడంతో పెద్ద సంఖ్యలో దరఖాస్తులు అందాయి. ఓటర్ల పేర్లు, చిరునామా మార్పులు, డూప్లికేట్ ఎంట్రీలపై వచ్చిన అభ్యంతరాలను పరిశీలించి అవసరమైన సవరణలు చేసినట్లు అధికారులు తెలిపారు. అన్ని అభ్యంతరాల పరిష్కారానంతరం తుది జాబితాను విడుదల చేయనుండడంతో స్థానికంగా తీవ్ర ఉత్కంఠ రేపుతోంది.