ADB: తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను విడుదల చేయాలని తెలంగాణ విద్యార్థి పరిషత్ నాయకులు ప్రభుత్వాన్ని కోరారు. ఆదివారం పట్టణంలో సంఘం నాయకులతో TGVP ఉమ్మడి జిల్లాధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ సమావేశమై మాట్లాడారు. సమస్యను పరిష్కరించాలని కోరుతూ.. ప్రైవేటు కళాశాలలు చేస్తున్న నిరవధిక బంద్కు సహకరిస్తున్నట్లు తెలిపారు.