JN: లింగాల గణపురం మండలం కళ్ళెం గ్రామానికి చెందిన దళితరత్న అవార్డు గ్రహీత మబ్బు పరశురామ్‌కు అరుదైన గౌరవం దక్కింది. సామాజిక, విద్యా రంగాల్లో చేసిన సేవలకు గుర్తింపుగా జర్మనీకి చెందిన ఇంటర్నేషనల్ పీస్ యూనివర్సిటీ ఆయనకు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. రవీంద్రభారతిలో జరిగిన కార్యక్రమంలో జీసీఎస్ ఛైర్మన్ శ్రీనివాసన్ చేతుల మీదుగా నేడు అవార్డు అందుకున్నారు.