కోనసీమ: కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పీ4 పథకంలో భాగంగా ఖండ్రిగ గ్రామానికి చెందిన చిర్రా సత్యనారాయణమ్మ, చిర్రా స్వామి కుటుంబాలను దత్తత తీసుకున్నారు. నెలనెలా రూ. 3వేలు ఆర్థిక సహాయం అందించడంతో పాటు వారికి పక్కా ఇల్లు నిర్మించాలని అధికారులను ఆదేశించారు. పీ4 విజయానికి కూటమి నేతలు కృషి చేయాలని పిలుపునిచ్చారు.