RR: ఫరూఖ్ నగర్ మండల పరిధిలోని నాగులపల్లి గ్రామంలో రుత్విక్ అనే మూడేళ్ల బాలుడిపై వీధి కుక్కలు దాడి చేశాయి. బాలుడు కేకలు వేయడంతో స్థానికులు వచ్చి కుక్కలను తరిమికొట్టారు. ఈ దాడిలో బాలుడి కన్నుకు గాయం కాగా, షాద్నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లడంతో అక్కడి నుంచి సరోజినీ కంటి ఆసుపత్రికి తరలించారు. అధికారులు కుక్క బెడదను తొలగించాలని గ్రామస్తులు కోరుతున్నారు.