JN: దేవరుప్పుల మండలం చిప్పరాళ్ల బండ తండాలో మారి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో అధిక గాఢత గల పురుగు మందులపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ సిబ్బంది మాట్లాడుతూ.. అధిక గాఢత గల పురుగు మందులు వాడటం వల్ల పర్యావరణానికి, మానవాళికి నష్టం జరిగే అవకాశం ఉందన్నారు. క్యాన్సర్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అధిక గాఢత మందులు వాడొద్దన్నారు.