మెదక్ జిల్లా రేగోడ్ మండలం చౌదర్పల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవి కోసం అన్నదమ్ముల మధ్య పోటీ నెలకొంది. గ్రామస్థుల ఆకాంక్ష మేరకే పోటీలో ఉన్నానని అన్న దేవేందర్ తెలిపారు. గతంలో సర్పంచ్‌గా పనిచేసిన అనుభవంతో గ్రామ సమస్యలపై పూర్తి అవగాహన ఉందని తమ్ముడు సురేందర్ అంటున్నారు. ఇరువురూ గ్రామాభివృద్ధే లక్ష్యంగా బరిలో ఉండగా ప్రజలు ఎవరిని ఎన్నుకుంటారో అనేది ప్రశ్నార్థకంగా మారింది.